Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమా ఇప్పుడు బారియర్స్ దాటుకుని విశ్వ వ్యాప్తమవుతుంది. డిస్నీ సంస్థ ఓ విజువల్ వండర్‌గా 'టర్మినేటర్: డార్క్ ఫేట్' చిత్రాన్ని తెలుగు ఆడియెన్స్‌కి అందిస్తుంది. అలాగే అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో మనం కూడా సినిమాలు చేయాలి. వాటిని డిస్నీ వాళ్ళు యూఎస్‌లో డబ్ చేసి విడుదల చేయాలి' అని విజరు దేవరకొండ అన్నారు. ఆర్నాల్డ్ స్వ్కార్జ్ నెగ్గర్ ప్రధాన పాత్రలో టిమ్ మిల్లర్ దర్శకత్వం వహించిన 'టర్మినేటర్: ది డార్క్ ఫేట్' చిత్ర తెలుగు ట్రైలర్ లాంచ్ బుధవారం జరిగింది. అతిథిగా విచ్చేసిన విజరు దేవరకొండ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'చదువుకునే రోజుల్లో 'టర్మినేటర్ 2: జడ్డ్మెంట్ డే' చూశా. ఆ సినిమా బాగా నచ్చింది. అందులో విలన్ని ఎంత కాల్చినా చావడు. అప్పుడు మేం బాగా ఎంజారు చేశాం. జేమ్స్ కామెరూన్, ఆర్నాల్డ్ చేసిన మ్యాజిక్ అది. తర్వాత మళ్ళీ ఈ ట్రైలర్ నాకు నచ్చింది. అయితే అప్పట్లో '300' అనే ఓ సినిమాని తెలుగులో చూశాం. తెలుగు అనువాదం చాలా ఇరిటేటింగ్‌గా అనిపించింది. ఇప్పుడు డబ్బింగ్ చాలా క్వాలిటీగా ఉంది. ఒకప్పుడు తమిళ చిత్రాలను డబ్బింగ్లో చూసేవాళ్ళం. రజనీకాంత్, సూర్య వంటి వారి నటనని బాగా ఎంజరు చేసేవాళ్ళం. కానీ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ బేస్డ్ సినిమాలను భాషభేదం, ఎమోషన్స్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ఆదరిస్తారు. ఇటీవల డిస్నీ నుంచి 'అవెంజర్స్', 'ది లయన్ కింగ్', 'అల్లాదీన్' చిత్రాలు విడుదలై మంచి విజయాలు సాధించాయి. ఈ చిత్రం కూడా పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నా. నాకు గన్ అంటే ఇష్టం ఉండదు. వాటిని చూసినప్పుడు డిస్ కనెక్ట్ అవుతా. ఇలాంటి యాక్షన్ సినిమాలకు ప్రభాస్ అన్న అయితే బాగా సూట్ అవుతాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది. అందులో సిక్స్ ప్యాక్‌లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నా. నాకు సంబంధించి లేడీ సూపర్ హీరో ఎవరు అనంటే మమ్మీ పేరు చెబుతా. ఎందుకంటే మన ప్రతి అడుగులో అమ్మ సపోర్ట్ ఉంటుంది. నాన్న నాకు కొలిగ్లా ఉంటారు. ఓ దశకు వచ్చాక మనమే వాళ్ళకు అన్నీ అవుతాం. అందుకే అమ్మ నా సూపర్ హీరో' అని అన్నారు. 'గత చిత్రాలు 'అవెంజర్స్', 'ది లయన్ కింగ్'లకు తెలుగు, హిందీలో మంచి స్పందన లభించింది. ఆడియెన్స్ నేటివిటీని కోరుకుంటున్నారు. అందుకే ఈసారి హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో విడుదల చేస్తున్నాం. ఇందులో ఆర్నాల్డ్‌కి హీరో వెంకటేష్ డబ్బింగ్ చెప్పారు. సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది' అని డిస్నీ ప్రతినిధి విక్రమ్ దుగ్గల్ తెలిపారు.