Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రభాస్ చాలా నైస్ పర్సన్. చాలా కూల్‌గా ఉంటారు. ఆయన 'బాహుబలి' లాంటి సినిమా చేయడం చాలా ఆశ్చర్యంగా ఉంది' అని అంటోంది పూజా హెగ్డే. టాలీవుడ్లో అగ్ర కథానాయికగా రాణిస్తున్న పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తుంది. 1970కి చెందిన పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రానికి 'జాన్' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, పూజా హెగ్డే షూటింగ్లో పాల్గొన్నారు. ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని పూజా పంచుకుంది. 'నేను చేస్తున్న బెస్ట్ స్క్రిప్ట్స్‌లో ఇదొకటి. ఇందులో ప్రభాస్‌తో కలిసి నటిం చడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మంచి హ్యూమన్ బీయింగ్. సరదాగా, కూల్‌గా ఉంటారు. ఇప్పటికే కొన్ని రోజులు ప్రభాస్‌తో షూటింగ్లో పాల్గొన్నాను. మమ్మల్ని ఎంతో బాగా చూసుకున్నారు. ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అంతేకాదు ఫుడ్‌ని బాగా ఇష్టపడతారు. షూటింగ్ టైమ్‌లో మా కోసం వంట కూడా చేశారు. ఇదొక భిన్నమైన అనుభూతి. ఈ సినిమా పరిణతి చెందిన ప్రేమ కథ. త్వరలో ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటాను' అని తెలిపింది. నవంబర్‌లో జరిగే షెడ్యూల్లో పూజా జాయిన్ అవుతుందని తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 23న ప్రభాస్పుట్టిన రోజు. ఈ సందర్భంగా 22న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారట. దీంతోపాటు పూజా హిందీలో నటించిన 'హౌస్‌ఫుల్ 4' దీపావళి కానుకగా విడుదల కానుంది. అలాగే బన్నీతో కలిసి 'అలా వైకుంఠపురములో' కథానాయికగా నటిస్తుంది.