Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో 2017లో తమిళంలో రూపొంది ఘన విజయం సాధించిన చిత్రం 'విక్రమ్వేద'. ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి గత కొన్ని రోజులు ప్లాన్ జరుగుతుంది. కానీ ఇప్పటికీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. తాజాగా బాలీవుడ్లో ఈ సినిమా రీమేక్ కన్ఫమ్ అయ్యిందట. అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రధారులుగా సినిమా రూపొందనున్నట్టు తెలుస్తుంది. విజయ్ సేతుపతి పాత్రలో అమీర్ ఖాన్, మాధవన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తారట. ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలు గ్రీన్ సిగల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. మాతృకకి దర్శకత్వం వహించిన పుష్కర్, గాయత్రి హిందీలో కూడా దర్శకత్వం వహించను న్నారు. మరి ఈ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తారనేది తెలియాల్సి ఉంది. అమీర్ ఖాన్ చివరిగా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్' చిత్రంలో నటించారు. అది పరాజయం చెందడంతో ఇప్పటికీ మరే సినిమాకి గ్రీన్ సిగల్ ఇవ్వలేదు. నెక్ట్స్ ఈ సినిమా చేయనున్నట్టు సమాచారం. మరోవైపు సైఫ్ అలీ ఖాన్ నటించిన 'లాల్ కప్టాన్' శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ని తెచ్చుకుంటోంది. దీంతోపాటు 'తానాజీ: ది అన్సంగ్ వారియర్', 'జవాని జానెమన్', 'దిల్ బెచార' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే వినోద్ కప్రీ దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందే ఓ సర్వైవల్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చారు.