Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనివాస్ అవసరాల, రుహానీ శర్మ జంటగా రాచకొండ విద్యాసాగర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైనర్మెంట్స్ పతాకాలపై దిల్‌రాజు, క్రిష్ సమర్పణలో శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నూటొక్క జిల్లాల అందగాడు'. ఈ సినిమా శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, 'నవ్య మైన కథలను, ప్రతిభ కలిగిన దర్శకులను పరిచయం చేయడంలో దిల్‌రాజు ముందుంటారు. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌తో కలిసి విద్యాసాగర్ అనే నూతన దర్శకుడిని ఇండిస్టీకి పరిచయం చేస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, ఫన్ ఎంటర్టైనర్గా సినిమా తెరకెక్కనుంది. రామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతాన్ని అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తాం' అని తెలిపింది.