Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జి.పి.ఎస్. కపిలాక్షి మల్హోత్రా, సోనాక్షి వర్మ, మమతా శ్రీ చౌదరి, సంజనా చౌదరి, అంకిత, జ్యోతి రాజ్‌పుత్ హీరోహీరోయిన్లుగా మురళీ రామస్వామి దర్శకత్వంలో ఎస్.ఎస్.ఆర్ట్ ప్రొడక్షన్స్, రాహుల్ భారు మీడియా, దుర్గ శ్రీ ఫిల్మ్స్ పతాకాలపై పి.ఎస్.రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమ పిపాసి'. ఈ చిత్ర టీజర్ విడుదల కార్యక్రమం శనివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన పి.వి.ఆర్ విష్ణు మాట్లాడుతూ, 'నిర్మాత రామకృష్ణ ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమా తీశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు. 'సినిమాని నేచురల్ లొకేషన్స్‌లో చాలా 'రా' గా తీశాం. ట్రెండీగా ఉంటుంది. ఎక్కడా బూతులుండవు. మనలో బయటకి కనిపించేది ఒకరైతే, లోపల మరొకరుంటారు. వాడే నిజం. అదే ఈ సినిమా. లవ్, రొమాన్స్, కామెడీ, యాక్షన్, మంచి మ్యూజిక్, ఎమోషన్స్ మేళవించిన పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ చిత్రమిది. అన్ని వర్గాల వారు చూసేలా ఉంటుంది. చిత్ర పోస్టర్ బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నా, సినిమా మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. కచ్చితంగా అందరికి నచ్చుతుందనుకుంటున్నా' అని చిత్ర దర్శకుడు మురళీ రామస్వామి తెలిపారు.
హీరో జి.పి.ఎస్ చెబుతూ, 'ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి, ఇక ఇంటికెళ్ళిపోదామనుకున్నప్పుడు ఒక్క అవకాశం వస్తే ఎంతగా కష్టపడి చేస్తామో, అలా ఈ చిత్రానికి టీమ్ అంతా ప్రాణం పెట్టి చేశాం. చాలా కొత్త కథ. సినిమా ఇలా తీయాలి, ఇలా నటించాలనే కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని బ్రేక్ చేసే చిత్రమిది' అని చెప్పారు. 'జి.పి.ఎస్ అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో ట్రెండింగ్ హీరో అవుతాడు. దర్శకుడు, కెమెరామెన్ చాలా కష్టపడి అత్యద్భుతంగా తెరకెక్కించారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత పి.ఎస్.రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రిష్, సోనాక్షి వర్మ, శ్రీరామ్, జగన్నాథ్, రాహుల్ పండిట్, కపిలాక్షి, అంకిత, జ్యోతి రాజ్‌పుత్ తదితరులు పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.