Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడలో విడుదలై ఘన విజయం సాధించిన 'జిందా' చిత్ర తెలుగు హక్కులను ఎస్.మంజు సొంతం చేసుకున్నారు. 'జిందా అనే దొంగల గ్యాంగ్‌లో చదువుపై ఆసక్తి ఉన్న తోటి దొంగని కాలేజీలో చదివిస్తారు, అక్కడ ఆ దొంగ ప్రేమలో పడతాడు. దీంతో తన గ్యాంగ్ ఎటువంటి పరిణామాలు ఎదుర్కొందనేది ఆసాంతం ఉత్కంఠ భరితంగా దర్శకుడు ముష్ సంజయ్ మహేష్ తెరకెక్కించాడు. సంగీత దర్శకుడు శ్రీధర్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ హైలైట్. కౌరవ వెంకటేష్ కంపోజ్ చేసిన ఫైట్స్ మన తెలుగు మాస్ ప్రేక్షకులకి చక్కటి విందు భోజనంలా ఉంటుంది. కన్నడలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఫైట్లు, యాక్షన్ సన్నివేశాలు, పోలీస్ ఇంట్రాగేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి. 'బెండు అప్పారావు' సినిమాలో హీరోయిన్గా నటించిన మేఘన రాజ్ అందాలు, దేవరాజ్ నటన అద్భుతంగా ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'జిందా గ్యాంగ్' పేరుతో నవంబర్ 1న విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ చిత్రం తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకం ఉంది' అని నిర్మాత ఎస్.మంజు అన్నారు.