Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిజిఆర్ ఫిల్మ్ అండ్ టివి స్టూడియోస్ బ్యానర్ పై సీనియర్ కమెడియన్ గౌతంరాజు తన తనయుడు కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం 'కృష్ణారావ్ సూపర్ మార్కెట్'. శ్రీనాథ్ పులకరం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రం ఇటీవల రిలీజై పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్స్ రాబడుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో గౌతంరాజు మాట్లాడుతూ, 'మా సినిమా యూత్‌ఫుల్ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ శక్రవారం విడుదలై విజయవంతంగా ఆడుతోంది. మా చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చిన మీడియాకి ధన్యవాదాలు. క్లైమాక్స్ వరకూ సస్పెన్స్ అలానే సస్టైన్ అయ్యి ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తుంది. మా డైరెక్టర్ కొత్త వారైనా స్క్రీన్ ప్లేని చాలా కొత్తగా నడిపి సినిమాని మరో ఎత్తుకు తీసుకెళ్లాడు. అలాగే మా అబ్బాయి కృష్ణ చిరంజీవి అభిమాని. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. బాక్సర్ పాత్ర కోసం బాక్సింగ్ కూడా నేర్చుకున్నాడు. మంచి సినిమా చేశారని అప్రిసియేషన్ వస్తోంది' అని అన్నారు. 'సినిమా పాజిటివ్ వైబ్స్ తో వెళ్తోంది. మంచి అప్లాజ్ వస్తోంది. చాలా కష్టపడి సినిమా చేశాం' అని హీరో కష్ణ చెప్పారు. డైరెక్టర్ శ్రీనాధ్ పులకరం మాట్లాడుతూ, 'సినిమా రిలీజై మా సక్సెస్‌ను మీతో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా చాలా బాగుందని ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పించడంలో సక్సెస్ కాలేదు. చాలా స్ట్రగుల్స్‌ని దాటి సినిమా తీశాం' అని చెప్పారు.