Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొన్ని పాత్రలు, కొన్ని సినిమాల్లో నటించే అవకాశాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన అవకాశమే నాకు 'కూలీ నెం.1' రీమేక్‌తో వచ్చింది. అంతేకాదు ఇందులో కరిష్మా కపూర్ పాత్రను పోషించే లక్కీ ఛాన్స్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది' అని అంటోంది సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ తనయగా 'కేధార్నాథ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగిడిన సారా తొలి చిత్రంతోనే ప్రేక్షకుల ప్రశంసల్ని సొంతం చేసుకుంది. తర్వాత 'సింబా'తోనూ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో బాలీవుడ్లో క్రేజీ కథానాయికగా అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆజ్ కల్' చిత్రంలో నటిస్తున్న సారా తాజాగా 'కూలీ నెం.1' రీమేక్‌లో నటించేందుకు గ్రీన్ సిగల్ ఇచ్చింది. గోవింద, కరిష్మా కపూర్ జంటగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్ర రీమేక్‌లో వరుణ్ ధావన్‌కి జోడీగా సారా నటిస్తోంది. 'ఈ రీమేక్‌లో నేనూ కరిష్మాలా మ్యాజిక్ చేస్తాను. అయితే ఆమెని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకరించను' అని సారా చెప్పింది.