Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రోనక్, ప్రీతి అర్సాని హీరోహీరోయిన్లుగా సుజోరు, సుశీల్ సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ప్రెషర్ కుక్కర్'. 'ప్రతి ఇంట్ల ఇదే లొల్లి' అనేది ట్యాగ్‌లైన్. కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై సుజోరు, సుశీల్, అప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటిం చారు. 'మంచి వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చిత్ర కథ నచ్చడంతో ఇటీవల ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా టీజర్‌ను కట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సునీల్ కశ్యప్, రాహుల్ సిప్లిగంజ్, స్మరణ్, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తుండగా నగేష్ బానెల్, అనిత్ మడాడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న గ్రాండ్‌గా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని యూనిట్ చెప్పింది.