Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మొన్నటి వరకు గ్లామర్ పాత్రలతోనే మెప్పించిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు పంథా మార్చింది. బలమైన పాత్రలతో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇటీవల ఆమె ఎంచుకుంటున్న సినిమాలు, పాత్రలని గమనిస్తేనే ఆ విషయం అర్థమవుతుంది. అందులో భాగంగా హిందీలో ప్రస్తుతం 'మర్జావాన్' చిత్రంలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటిస్తుంది. మిలాప్ జవేరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ సెక్స్ వర్కర్‌గా నటిస్తున్నారు. ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు సెక్స్ వర్కర్లు ఉండే బార్లకు వెళ్తుంది. అక్కడ వారిని పరోక్షంగా గమనించిందట. ఈ విషయాన్ని రకుల్ చెబుతూ, 'నేను నటిస్తున్న ఆర్జూ పాత్ర 1990 కాలానికి చెందింది. ఇటీవల కాలంలో ఇలాంటి పాత్రని ఎవరూ చేయలేదు. ఇందులో నా మాటలు, యాస కూడా భిన్నంగా ఉంటాయి. తలబిరుసుగా, పొగరుగా ఉంటాను. అదే సమయంలో చాలా దయ కలిగిన దానిని. ఈ పాత్రలోకి నేను మౌల్డ్ కావడం ఇప్పుడు సవాల్‌తో కూడిన అంశం. దీని కోసం గాల్లో తేలియాడే యోగా, బెల్లీడాన్స్లు కూడా నేర్చుకుంటున్నా. అంతేకాదు ఇటీవల ముఖానికి మాస్క్ ధరించి పబ్‌లకు వెళ్ళి సెక్స్ వర్కర్లను గమనించాను. వారు ఎలా డాన్స్ చేస్తున్నారు, హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందనేది గమనించాను. ఇదంతా ఈ సినిమాలో నటించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నా' అని తెలిపింది. దీంతోపాటు రకుల్ ప్రస్తుతం 'భారతీయుడు 2'లో నటిస్తుంది. అలాగే అర్జున్ కపూర్‌తో కలిసి ఓ బాలీవుడ్ చిత్రానికి గ్రీన్ సిగల్ ఇచ్చింది.