Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ''ఫ్రెజెన్ 2'. దీన్ని ఇంగ్లీష్‌తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 22న రిలీజ్ కానుంది. ఇందులో ప్రధాన పాత్రధారి చిన్నారి ఎల్సాకి మహేష్‌బాబు తనయ సితార వాయిస్ ఓవర్ ఇవ్వగా, పెద్ద ఎల్సాకి నిత్యా మీనన్ డబ్బింగ్ చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిత్యా మీనన్ మాట్లాడుతూ, ''ఈసినిమాలోని ప్రధాన పాత్ర ఎల్సాకి బాగా కనెక్ట్ అయ్యాను. నాకు దగ్గరగా ఉండే పాత్ర అది. ఈ సినిమాకి వాయిస్ ఇవ్వడానికి కూడా అదో కారణం. యానిమేషన్ చిత్రానికి వాయిస్ ఇవ్వడం డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్' అని చెప్పింది. 'ఎల్సా పాత్ర నాకు బాగా నచ్చింది. ఫన్నీగా ఉంటుంది. అందుకే వాయిస్ ఇచ్చాను. ఎల్సా నాకిష్టమైన యానిమేషన్ క్యారెక్టర్' అని సితార చెప్పింది.