Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు, రష్మిక మందన్నా జంటగా విజయ శాంతి కీలక పాత్రధారిణిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్‌రాజు సమర్పణలో అనిల్ సుంకర నిర్మించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'ఈ సంక్రాంతికి తెలుగు సినిమా కళకళలాడుతుంది. బాక్సాఫీసు దద్దరిల్లిపోతుంది. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసి, మహేష్‌బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిపిన ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు. శుక్రవారం నుంచి ఒకటిన్నర నిమిషాల కామెడీ సన్నివేశాన్ని యాడ్ చేస్తున్నాం. రిపీటెడ్‌గా చూడాలనుకునే ఆడియెన్స్ కోసం ఇంకాస్త నవ్వులను బోనస్‌గా అందించబోతున్నాం. 'రమణా లోడెత్తాలిరా..' డైలాగ్‌కి ఊహించినదానికంటే ఎక్కువగా స్పందన లభిస్తుంది. అందుకే మేం కూడా 'రమణా బాక్సాఫీసు లోడెత్తాలిరా..' అంటున్నాం' అని అన్నారు. 'నేను ఇండిస్టీలోకి వచ్చి 22ఏండ్లు అవుతుంది. ఇలాంటి సంక్రాంతిని ఎప్పుడూ చూడలేదు. కేవలం ఐదు నెలల్లో సినిమాని పూర్తి చేసి అటు మహేష్, ఇటు అనిల్ రావిపూడి సరిలేరు మాకెవ్వరు అనిపించారు. ఆడియెన్స్ కూడా బాక్సాఫీసు కా బాప్ అనేలా కలెక్షన్లని అందించి, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్లు నిజమైన సంక్రాంతి ఇదే అనుకునేలా చేశారు. అనిల్ ఐదు సినిమాలు చేసి, ఐదుగురు హీరోలకు కెరీర్ బెస్ట్ చిత్రాలను అందించాడు. మా బ్యానర్‌కి కూడా అత్యధిక కలెక్షన్లని రాబట్టిన చిత్రాలను అందించారు. ఈ సినిమా మున్ముందు ఇంకా ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఇప్పుడే చెప్పలేం. సంక్రాంతికి రావాలనే సంకల్పంతో పెద్ద స్టార్ అయి ఉండి కూడా వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసిన మహేష్‌కి, ఈ సంక్రాంతికి ఇంతటి రెవిన్యూని ఇచ్చిన ఆడియెన్స్‌కి థ్యాంక్స్' అని దిల్‌రాజు తెలిపారు.
మరో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ, 'సంక్రాంతి పండుగ ముగిసినా సంక్రాంతి సినిమాలకు పండుగ ఇంకా కొనసాగుతూనే ఉంది. మా చిత్రం మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది దర్శకుడు అనిల్ రావిపూడికి బిగ్గెస్ట్ ఎచీవ్మెంట్. ఆయన కష్టానికి దక్కిన ప్రతిఫలమిది. సినిమాకి దిల్‌రాజు సహకారం మరువలేనిది. మేం అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఇది బెస్ట్ సంక్రాంతి అని డిస్ట్రిబ్యూటర్స్ అంటున్నారు. అలాంటి సంక్రాంతిలో మా సినిమా ఉండటం ఆనందంగా ఉంది' అని చెప్పారు.