Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' అనే చిత్రం రూపొందుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి. వి.క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం బుధవారం అనంతపురం జిల్లా ఉరవకొండలోని పాల్తూరి గ్రామంలో ప్రారంభమైంది. హీరో వెంకటేష్‌పై మొదటి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, ''ఎఫ్2', 'వెంకీమామ' వంటి వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో దూసుకెళ్తున్న వెంకటేష్ నటిస్తున్న 74వ చిత్రమిది. తమిళ్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా సంచలనం సృష్టించిన 'అసురన్' చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నాం. చిత్ర టైటిల్‌ని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. 'నారప్ప' గెటప్‌లో విక్టరీ వెంకటేష్ లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. మాస్ గెటప్‌లో పూర్తి వైవిధ్యంగా కనిపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం పరిసర ప్రాంతాల్లోని రియలిస్టిక్ లొకేషన్లలో కీలక సన్నివేశాలను మొదటి షెడ్యూల్లో చిత్రీకరించనున్నాం. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నాం' అని పేర్కొంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్.