Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' చిత్రంతో హీరోగా మారుతున్నారు. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', 'వన్: నేనొక్కడినే' చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసిన మున్నా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీపి పిక్చర్స్ పతాకంపై ఎస్వీ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ని శనివారం హీరో రానా విడుదల చేసి చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సినిమా గురించి యూనిట్ మాట్లాడుతూ, 'రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాని రూపొందిస్తున్నాం. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లో పల్లెటూరి వేషంలో ఉన్న ప్రదీప్, ప్రేయసిగా నటిస్తోన్న అమృతా అయ్యర్‌తో కలిసి హుషారుగా కనిపిస్తున్నాడు. ఇద్దరి ముఖాల్లోనూ ఉల్లాసం తాండవిస్తోంది. సూర్యోదయం, జలపాతాలు, పక్షులు, పచ్చనిచెట్ల బ్యాగ్రౌండ్ ఒక అందమైన పెయింటింగ్‌ని తలపిస్తోంది. టైటిల్ కూడా ఆసక్తికరంగా ఉంది. బాణం విసురుతున్న మన్మథుడు, గులాబీ, లవ్ లెటర్, తాళం వేసిన హృదయం వంటి వాటితో ఈ టైటిల్‌ని డిజైన్ చేశాం. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని తెలిపింది. శివన్నారాయణ, హేమ, పోసాని క ష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్ ఇతర పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: దాశరథి శివేంద్ర, సంగీతం: అనూప్ రూబెన్స్.