Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్య, అపర్న బాలమురళి హీరో హీరోయిన్లుగా సుధా కొంగరా దర్శకత్వంలో 'ఆకాశమే నీ హద్దురా' చిత్రం రూపొందుతుంది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని 'పిల్ల పులి' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని ప్రేమికుల రోజుని పురస్కరించుకుని గురువారం విడుదల చేశారు. స్పైస్‌జెట్ విమానంలో నుంచి అగరమ్ ఫౌండేషన్‌కి చెందిన దాదాపు 100 మంది పేద పిల్లలతో కలిసి ఈ పాటని విడుదల చేయటం విశేషం.
ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ, '2000 సంవత్సర సమయంలో కేవలం ఒక్క శాతం ప్రజలు మాత్రమే విమానాన్ని ఎక్కేవారు. కానీ కెప్టెన్ గోపీనాథ్ విమానయాణ రంగాన్నే మార్చేశారు. సామాన్య మనిషి సైతం విమానాన్ని ఎక్కగలిగేలా చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నాం. సుధా పదేండ్లుగా ఈ కథపై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికి అది సాధ్యమైంది. ఈ సినిమాకి వచ్చే క్రెడిట్ మొత్తం ఆమెకే చెందుతుంది. ఇప్పుడు నా కెరీర్‌కిది చాలా ముఖ్యమైన సమయం. మోహన్‌బాబు ఓ గాడ్‌ఫాదర్ లాంటి వారు. మా మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ అవుతాయి. ఇది మరుగున పడిన హీరోలకు ఓ గౌరవం లాంటి చిత్రమవుతుంది' అని అన్నారు. 'తమిళంలో శివాజీగణేషన్ తర్వాత శివకుమార్ అత్యుత్తమ నటుడు. ఆయన కుమారుడు సూర్యతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. కొడుకు విషయంలో శివకుమార్ గర్వపడాలి. ఎందుకంటే సూర్య గొప్ప నటుడు. సుధా క్రమశిక్షణ కలిగిన దర్శకురాలు. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా' అని మోహన్‌బాబు తెలిపారు. దర్శకురాలు సుధాకొంగర చెబుతూ, 'సూర్య ఇచ్చిన ఫ్రీడమ్‌తో సినిమాని బాగా తీయగలిగాను. మా తండ్రి ఇటీవల మరణించారు. దీంతో మోహన్‌బాబుని నా తండ్రిలాగా ఆడాప్ట్ చేసుకున్నా. ఆయన మాత్రమే నన్ను బాగా చూసుకోగలరు' అని తెలిపింది.