Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్‌దేవ్, రచితా రామ్ జంటగా పులివాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్, ఖుషి నిర్మిస్తున్న చిత్రం 'సూపర్ మచ్చి'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించి ప్రేమికుల రోజుని పురస్కరించుకుని కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'తొలి సినిమా 'విజేత'లో నటనతో ఆకట్టుకున్న కల్యాణ్ దేవ్ ఇందులో మరింత చక్కటి నటనతో అలరిస్తారు. అటు మాస్ ఆడియెన్స్‌కి, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఆయన పాత్ర బాగా కనెక్ట్ అవుతుంది. తమన్ మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఐదు పాటల్లో ఇప్పటికే చిత్రీకరించిన రెండు పాటలూ చాలా అందంగా వచ్చాయి. 'సూపర్ మచ్చి' టైటిల్ సాంగ్ బ్రహ్మాండంగా వచ్చింది. ఆడియో బ్లాక్ బస్టర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమాకు కన్నడ హీరోయిన్ రచితా రామ్ ప్లస్ అవుతుంది. ఈ సినిమాతో మా బ్యానర్‌కి మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నాం. రాజేంద్రప్రసాద్, నరేష్ అందించే కామెడీ అమితంగా అలరిస్తుంది. హీరోకి సపోర్టింగ్‌గా నరేష్ క్యారెక్టర్ ఉంటుంది. వాళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. అలాగే రాజేంద్రప్రసాద్, హీరో కాంబినేషన్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి. ఇది లవ్ స్టోరీ మిక్స్ చేసిన చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్. టాకీ మొత్తం పూర్తయ్యింది. రెండు పాటలను వచ్చే నెలలో గోవాలో షూట్ చేయనున్నాం' అని చెప్పారు.