Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటిస్తోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో, హీరోయిన్ ఫస్ట్‌లుక్‌లను శుక్రవారం విడుదల చేశారు. ఆ విశేషాలను చిత్ర బృందం తెలియజేస్తూ, 'ఇప్పటికే విడుదల చేసిన వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి ప్రీ లుక్‌లకు మంచి స్పందన లభించింది. వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఈ చిత్రంలోని హీరో హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశాం. రంగురంగుల డ్రస్‌లో మాస్ లుక్‌తో వైష్ణవ్ తేజ్ ఆకట్టుకుంటుండగా, ఒక బస్సులోంచి తల బయటకు పెట్టి చూస్తూ కృతి క్యూట్‌గా కనిపిస్తోంది. తమిళ హీరో విజరు సేతుపతి ఓ ప్రముఖ పాత్ర చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌కి సైతం అనూహ్యమైన స్పందన లభించింది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతుంది. అన్ని పనులు పూర్తి చేసి ఏప్రిల్ 2న సినిమాని విడుదల చేస్తున్నాం' అని తెలిపింది. సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: శాందత్ సైనుద్దీన్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: మౌనిక రామకృష్ణ.