Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రీఎంట్రీ తర్వాత కరీనా కపూర్ చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అంతేకాదు విభిన్న పాత్రలతో తన మార్క్‌ని ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్‌తో కలిసి 'లాల్ సింగ్ చద్దా' చిత్రంలో నటిస్తుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హాలీవుడ్ హిట్ సినిమా 'ఫారెస్ట్ గంప్'కి రీమేక్. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్రానికి సంబంధించిన కరీనా కపూర్ లుక్‌ని అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'నాకు ప్రతీ సినిమాలో నీతోనే(కరీనా) కలిసి రొమాన్స్ చేయాలని ఉంది. ఎందుకంటే తనతో రొమాన్స్ నాకు సహజంగా వచ్చేస్తుంది. కరీనాకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు' అని అమీర్ పేర్కొన్నారు. అమీర్‌ని హగ్ చేసుకున్న కరీనా లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇది ఓ వ్యక్తి ముప్పై ఏండ్ల రాజకీయ, సామాజిక జర్నీని తెలియజేస్తుంది. క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేయనున్నారు. ఇందులో అమీర్ మూడు భిన్న గెటప్‌లో కనిపించనున్నారట. దీంతోపాటు కరీనా 'ఆంగ్రేజీ మీడియం' చిత్రంలో ఇర్ఫాన్ ఖాన్‌తో కలిసి నటిస్తుంది. ఈ చిత్ర ట్రైలర్‌ని తాజాగా విడుదల చేశారు. ఆద్యంతం కామెడీ ఎంటర్టైనర్గా సాగే ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. హోమి అడజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చిలో విడుదల కానుంది.