Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో అత్యంత వేగంగా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్ కుమార్ ముందుంటారు. ప్రస్తుతం ఆరు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమాని అక్షయ్ ప్రకటించారు. 'బాప్ రే బాప్' పేరుతో మరో సినిమా చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అంతేకాదు ఇందులో త్రిపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. ఆ విశేషాలను తెలియజేస్తూ అక్కీ ట్విట్టర్ ద్వారా కొత్త చిత్రానికి సంబంధించిన పోస్టర్ని పంచుకున్నారు. యంగ్ ఏజ్‌లో, మిడిల్ ఏజ్‌లో, వృద్ధుడిగా మూడుగెటప్స్లో ఉన్న లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. 'త్వరలో మసాలాదార్ ఎంటర్టైనర్ రాబోతుంది' అని అక్కీ తెలిపారు. మరి ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. త్రిపాత్రాభినయం చేయడం అక్షయ్ కిదే తొలిసారి కావడం విశేషం. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలతో అలరిస్తున్న అక్కీ ఇప్పుడు ఒకే సినిమాలో మూడు పాత్రలతో ఆడియెన్స్‌ని మరింతగా అలరిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం అక్షయ్ 'సూర్యవంశీ', 'బచ్చన్ పాండే', 'పృథ్వీరాజ్', 'లక్ష్మీబాంబ్', 'బేల్ బాటమ్', 'ఆట్రాంగి రే' చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. దీంతో ఈ ఏడాదితోపాటు వచ్చే ఏడాది వరకు అక్షయ్ బ్యాక్ టూ బ్యాక్ ఆడియెన్స్‌కి వినోదాన్ని పంచుతారని చెప్పొచ్చు.