Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికత్తి కథానాయికలుగా రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీల'. రానా దగ్గుబాటి సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18మోషన్ పిక్చర్స్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతుంది. ప్రేమికుల రోజుని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ని హీరో వెంకటేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా యూనిట్ చెబుతూ, 'ఒక సమకాలీన అంశంతో సాగే టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. 'క్షణం'తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నారు. సరికొత్త కథనంతో మ్యాజిక్ చేయడం ఆయన బలం. రాంగ్ టైమ్ రిలేషన్‌షిప్స్‌తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా సిద్ధు జొన్నలగడ్డ కనిపించనున్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో సరసాల్లో మునిగితేలుతుంటాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటన, అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కథకి తగ్గట్టుగా శ్రీచరణ్ పాకాల మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తెలిపే విధంగా 'పులిహోర కలిపెనులే' అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ 'పులిహోర' ట్రాక్‌ను హేమచంద్ర రచించి పాడారు. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రవికాంత్ రాయడం గమనార్హం. త్వరలో ట్రైలర్‌ను, మే 1న సినిమాని విడుదల చేయనున్నాం' అని చెప్పింది.