Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ మంచి నటుడు మాత్రమే కాదు, అద్భుతమైన గాయకుడు కూడా. తాను నటించిన చాలా చిత్రాల్లో ఇప్పటికే అనేక పాటలు పాడి శ్రోతలను, ఆయన అభిమానులను అలరించారు. తాజాగా ఆయన నటిస్తున్న 'మాస్టర్' చిత్రంలోనూ ఓ పాట పాడారు. 'కుట్టి స్టోరీ' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేసింది. దీనికి అనిరుధ్ రవిచందర్ స్వరాలను సమకూర్చగా, అనురాజా కామరాజ్ సాహిత్యాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. అంతేకాదు, ఈ లిరికల్ వీడియోని డిజైన్ చేసిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంటూ, అనిరుధ్ పాపులర్ సాంగ్ 'వై దిస్ కొలవెరి'ని తలపిస్తుంది. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న 'మాస్టర్' చిత్రంలో ఆండ్రియా, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. విజరు సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 9న విడుదల కానుంది.