Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రస్తుతం మన మధ్య తరగతి కుటుంబాల్లో అమెరికా వంటి ఇతర దేశాలకు వెళ్ళడమనేది గోల్‌గా పెట్టుకున్నారు. కానీ అది ఆ ప్రాంతానికి వెళ్లడం నిజమైన గోల్ కాదు. అక్కడ ఏం చేస్తున్నావు, అందులోని పాజిటివ్, నెగటివ్స్ని చర్చించే చిత్రమే 'ప్రెజర్ కుక్కర్'' అని అంటున్నారు దర్శకులు సుజరు, సుశీల్.
సాయిరోనక్, ప్రీతి జంటగా సుజరు, సుశీల్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక ద్వయం సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'వరంగల్‌లో పుట్టి పెరిగి అమెరికా వెళ్ళిన మాకు చిన్నప్పట్నుంచి సినిమాల్లోకి రావాలనే కోరిక ఉండేది. అమెరికా వెళ్ళొచ్చాక మా అనుభవాలతో సినిమా తీయాలనుకున్నాం. చిన్నప్పుడు ఏవైతే అనుకున్నామో వాటిని ఫుల్ ఫిల్ చేసే పనిలో పడ్డాం. అందులో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. కొత్త దర్శకులం కాబట్టి నిర్మించేందుకు ఎవరూ ముందుకు రారు. అందుకే మేమే నిర్మించాం. యూఎస్గానీ, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వారికి, పేరెంట్స్‌కి సంబంధించిన విషయాలు, మధ్యతరగతి కుటుంబాల్లో విదేశాలకు వెళ్ళాలనే దాంట్లో వారి ఉద్దేశాలను ఫన్‌తోపాటు ఎమోషన్స్‌ని మేళవించి రూపొందించాం. ఇందులో చాలా స్టోరీస్ ఉంటాయి. చాలా ఎమోషన్స్ ఉంటాయి. సందేశం కూడా భిన్నంగా ఉంటుంది. ఓ యువకుడిలో కెరీర్‌కి సంబంధించిన ప్రెజర్స్ చాలా ఉంటాయి. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదని, ఆ తర్వాత అమెరికా వెళ్ళాలని, వీసా రాలేదని, మరోవైపు లవర్‌కి సంబంధించిన ఒత్తిడీ ఉంటుంది. దీంతో అతను నిత్యం ఓ ప్రెజర్ కుక్కర్లో ఉన్నట్టు ఫీల్ అవుతుంటాడు. మరి అతని జర్నీ ఎలా సాగిందనేది సినిమా. మేం పుట్టి పెరిగింది తెలంగాణలో కాబట్టి మెయిన్‌గా తెలంగాణ నేపథ్యంలో సినిమాని రూపొందించాం. 'పెళ్ళిచూపులు' కంటే ముందే ఈ కథ రాసుకున్నాం. ఆ సినిమా చూసి మేం కూడా ఆశ్చర్యపోయాం.
జనరల్‌గా సినిమా తీయడం ఓ ప్రెజర్ అయితే, దాన్ని విడుదల చేయడం మరో ప్రెజర్. ఈ క్రమంలో మేం చాలా అనుభవాన్ని పొందాం. జాబ్ చేస్తూ టైమ్ దొరికినప్పుడే సినిమాని తెరకెక్కించాం. విడుదల సమయంలో స్టార్ కాస్ట్ లేదనే కామెంట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి విన్నాం. స్టార్ కాస్ట్ ఉంటే, బిజినెస్ పరంగా ఓ గ్యారంటీ ఉంటుందనేది వారి నమ్మకం. ముందే పెట్టిన డబ్బులు ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలో వస్తాయి. కానీ మేం కంటెంట్‌ని నమ్మి చేశాం. చాలా మందికి ప్రివ్యూ చూపించాం. అందరు బాగుందంటూ ప్రశంసించారు. కానీ ఎవ్వరూ సినిమాని రిలీజ్ చేసేందుకు ముందుకురాలేదు. చివరగా అభిషేక్ పిక్చర్స్ వాళ్ళు సినిమా చూసి విడుదలకు ముందుకు వచ్చారు. మా కథపై వాళ్ళకి ఏర్పడిన నమ్మకమే ఇందుకు ముఖ్య కారణమని నమ్ముతున్నాం.
దీంతో కొంత వరకు సాఫీగానే సాగినా సరైన రిలీజ్ డేట్స్ దొరక్క, థియేటర్ల సమస్య వంటి కారణాలతో వాయిదా వేసుకుంటూ వస్తున్నాం. ఫైనల్‌గా ఈ శుక్రవారం విడుదల చేస్తున్నాం. అయితే ప్రతి విషయంలో భయం ఉండాలి. అప్పుడే మంచి అవుట్‌పుట్ వస్తుంది. అదే భయంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమాపై నమ్మకంతో ఉన్నాం. రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఆడియెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. దీని తర్వాత మరో ఆరు డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలున్నాయి. దీని ఫలితంపైనే మా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది' అని అన్నారు.