Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుష్, మెహరీన్ జంటగా, ఆర్.ఎస్.దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ సంయుక్తంగా నిర్మించిన ఓ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ తెలుగులో 'లోకల్ బారు' పేరుతో విడుదల చేస్తున్నారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాత సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, 'మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్‌లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేశారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ట్రైలర్‌కి మంచి స్పందన లభించింది. ఈ నెల 28న విడుదలవుతున్న సినిమా కూడా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.
సినిమాలో మెహరీన్, స్నేహ, నవీన్ చంద్ర, నాజర్ వంటి తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటీనటులు ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ధనుష్, ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన 'ధర్మ యోగి' తెలుగులో మంచి విజయం సాధించింది.
ఆ చిత్రాన్ని కూడా తెలుగులో మేమే విడుదల చేశాం. ఇప్పుడు ఈ సినిమానూ మేమే విడుదల చేస్తున్నాం. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. నవీన్ చంద్ర విలన్ పాత్రను అత్యద్భుతంగా పోషించారు. తమిళంలో సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులో కూడా సక్సెస్ అవుతుంది' అని చెప్పారు.
క్రేజీ కాంబినేషన్లో ధనుష్ నయా చిత్రం
ధనుష్ హీరోగా, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతుంది. ధనుష్ నటిస్తున్న 40వ చిత్రమిది. వైనాట్ స్టూడియోస్ నిర్మాణంలో ఎస్.శశికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో జీఏ2యూవీ సంస్థ విడుదల చేయనున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందం చెబుతూ, ''లవ్ ఫెయిల్యూర్', 'గురు', 'గేమ్ ఓవర్' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వై నాట్' స్థూడియోస్ సంస్థ ధనుష్ హీరోగా, 'పిజ్జా', 'జిగర్ తండా'(చిక్కడు దొరకడు), 'పేట' వంటి హిట్ చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో క్రేజీ కాంబినేషన్‌గా 'డి40' (వర్కింగ్ టైటిల్) చిత్రం రూపొందుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి జీఏ2యూవీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నాయి. మినిమమ్ గ్యారెంటీ సబ్జెక్ట్స్‌తో మంచి నిర్మాణ విలువలతో సినిమాలను రూపొందించి అత్యధిక సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న ఈ రెండు సంస్ధలు ఈ చిత్రాన్ని విడుదల చేయటమే 'డి40'కి ఉన్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్, టీజర్ విడుదల తేదీలను త్వరలో ప్రకటిస్తాం' అని తెలిపింది.