Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాప్సీ వరుసగా డిఫరెంట్ చిత్రాల్లో నటిస్తూ తానేమిటో నిరూపించుకునే ప్రయత్నంలో సక్సెస్ సాధించింది. అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్ట్‌లను ప్రకటిస్తూ అందరినీ సర్ప్రైజ్ చేస్తోంది. ఇటీవలే 'సాండ్ కి ఆంఖ్'తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకున్న ఆమె ప్రస్తుతం 'తప్పాడ్'లో నటిస్తుంది. అలాగే ' రష్మీ రాకెట్' అనే మరో సినిమా చేస్తుంది. తాజాగా 'హసీనా దిల్రూబా'తోపాటు 'లూప్ లపేటా' అనే రెండు చిత్రాలను ప్రకటించారు. తాప్సీ, హన్సిక, విక్రాంత్ మస్సీ, హర్షవర్థన్ రానె ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'హసీన్ దిల్రూబా' చిత్రానికి వినిల్ మాథ్యూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇక తాప్సీ మరో సినిమా 'లూప్ లపేటా'ని ప్రకటిస్తూ 'మంచి స్క్రిప్ట్‌ల విషయంలో నేను దురాశతో ఉంటాను. అలాంటి మరో మంచి సినిమా 'లూప్ లపేటా' కామెడీ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. సోని పిక్చర్స్ ఇండియా, ఎల్లిప్సిస్ ఎంటర్టైన్మెంట్స్ అందిస్తున్న ఈ చిత్రం 'రన్ లోలా రన్'ని రీమేక్‌గా తెరకెక్కుతుంది' అని తెలిపింది. జర్మన్ క్లాసిక్ చిత్రం 'రన్ లోలా రన్' చిత్రానికి రీమేక్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తున్నారు. తహీర్ భాసిన్ హీరోగా నటిస్తుండగా, తాప్సీ కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 29న విడుదల చేయనున్నారు. రీమేక్ చిత్రాల్లో నటించడం తాప్సీకిది రెండోసారి. గతంలో 'బద్లా' చిత్రాన్ని స్పానిష్ చిత్రం 'ది ఇన్విజబుల్ గెస్ట్'కి రీమేక్‌గా తెరకెక్కించిన విషయం విదితమే.