Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన స్పిన్ బౌలింగ్‌తో టీమ్ ఇండియాకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించడంలో భాగమైన హర్భజన్ సింగ్ హీరోగా మారుతూ 'ఫ్రెండ్షిప్' చిత్రంలో నటిస్తున్నారు. తమిళ 'బిగ్ బాస్' ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా, జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీన్టో స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్, స్టాలిన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఇందులో ఓ కీలక పాత్రలో అర్జున్ నటిస్తున్నారు. ఆ విశేషాలను చిత్ర యూనిట్ తెలియజేస్తూ, 'టీమ్ ఇండియాకు స్పిన్ బౌలర్‌గా విశేష కృషి చేసిన హర్భజన్ సింగ్ తన సుదీర్ఘ క్రికెట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌కి సిద్దమయ్యారు. 'ఫ్రెండ్షిప్' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో సతీష్ నటిస్తున్నారు. పలు భారతీయ భాషల్లో సినిమాని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం. శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసి ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం' అని తెలిపింది.