Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నా ఫ్రెండ్స్ యు.ఎస్. వెళ్లిపోతుంటే నేను చాలా బాధపడుతుంటా. మా గ్రూప్లో సగం మంది అలా వెళ్లిపోయి, సగం మంది ఇక్కడ మిగిలిపోయాం. దీనిపై చేసిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది' అని హీరో విశ్వక్ సేన్ అన్నారు. సాయిరోనక్, ప్రీతి అస్రాని జంటగా నటించిన చిత్రం 'ప్రెజర్ కుక్కర్'. సుశీల్ సుభాష్ కారంపురి, అప్పిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సుజోరు, సుశీల్ దర్శకులు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఈ నెల 21న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'నేను రూ. 12 లక్షలు పెట్టి 'వెళ్లిపోమాకే' అనే సినిమా తీసినా. దాన్ని దిల్ రాజు గారు తీసుకొని రిలీజ్ చేశారు. ఆ రోజు నాకు ఎంత హ్యాపీ అనిపించిందో, కొత్తోళ్లు సినిమా తీసి రిలీజ్ అవుతోందంటే అంతే హ్యాపీ అనిపిస్తుంది. అది నా సినిమానే అని అనిపిస్తుంటుంది' అని అన్నారు. 'దాదాపు మూడు నెలల క్రితం ఈ సినిమా చూశాను. నచ్చింది కానీ అక్కడక్కడా చిన్న అసంతృప్తి అనిపించింది. చిన్న చిన్న కరెక్షన్స్ చేసి మళ్లీ వారం తర్వాత చూపించారు. చాలా బాగుంది. సుజోరు, సుశీల్ అద్భుతమైన సినిమా తీశారు. పన్నేండేళ్ల క్రితం ఇండిస్టీలోని చాలా మంది తలో ఒక చేయివేసి హెల్ప్ చేస్తేనే నేను రాగలిగాను. ఈ సినిమాకు అద్భుతమైన విజయం వచ్చి ఈ డైరెక్టర్లు మరిన్ని మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నా' అని దర్శకుడు క్రిష్ చెప్పారు. చిత్ర దర్శకులు చెబుతూ, 'మాతో ఎలాంటి బంధం లేకపోయినా డైరెక్టర్ క్రిష్ మా మూవీ చూసి నచ్చి, మాకు హెల్ప్ చేయాలని భావించారు. 'రేపు మీరు కూడా వేరేవాళ్లకు హెల్ప్ చేయాల'న్నారు. దాన్ని మా మైండులో పెట్టుకుంటాం. అందరికి నచ్చే చిత్రమవుతుంది' అని చెప్పారు. నిర్మాతల్లో ఒకరైన అప్పిరెడ్డి మాట్లాడుతూ, ''సుజోరు, సుశీల్ కలిసి ఎంతో కష్టపడి ఈ మూవీ స్క్రిప్ట్ రాసి, డైరెక్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీకి ధన్యవాదాలు. ఈ సినిమా ఒక మంచి స్ఫూర్తివంతంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది' అని అన్నారు. ఈ కార్యక్రమం లో నందినిరెడ్డి, నటి సంగీత, తనికెళ్ళ భరణి, సాయి రోనక్, ప్రీతి అస్రాని తదితరులు పాల్గొన్నారు.