Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' చిత్రం రూపొందుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన 'అసురన్'కిది రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ, ''నారప్ప' మోస్ట్ పవర్ఫుల్, ఎమోషనల్ క్యారెక్టర్. ప్రేక్షకులు 'నారప్ప'గా కొత్త వెంకటేష్‌ని చూస్తారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ తమిళనాడులో, ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం' అని అన్నారు. 'తమిళనాడులోని రెడ్ డెసర్ట్‌లో 10 రోజులు తీసిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రానికి హైలెట్ అవుతాయి. వెంకటేష్‌కి నాకు ఈ సినిమా ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్‌నిస్తుంది' అని ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ చెప్పారు. కో- ప్రొడ్యూసర్ శ్రీదేవి సతీష్ మాట్లాడుతూ, 'తమిళనాడులోని తిరిచందూర్ సమీపంలో ఉన్న తెరికాడులో 12,000 ఎకరాల్లో ఉండే ప్రదేశాన్ని రెడ్ డెసర్ట్ ఆఫ్ తమిళనాడు అంటారు. అక్కడ ఈ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశాం. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వీటిని అద్భుతంగా కంపోజ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది' అని చెప్పారు. 'ఇప్పటికే 27 రోజులు షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం నాన్ స్టాప్‌గా షెడ్యూల్ జరుగుతుంది' అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజరు శంకర్ దొంకాడ చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సామ్.కె నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్.