Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్'. కరోనా వైరస్ కారణంగా శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడింది. అలాగే ఈ సినిమా విడుదల తేదీ సైతం మారే అవకాశం ఉన్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఉగాది కానుకగా నేడు (బుధవారం) ఈ చిత్ర టైటిల్ లోగోతోపాటు మోషన్ పోస్టర్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించడం విశేషం. ఈ లేటెస్ట్ అప్డేట్తో ఇద్దరు అగ్రహీరోల అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.