Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నాకు నటన అంటే ఎంతో ఇష్టం. కథ నచ్చితేనే నటిస్తాను. నచ్చకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ నటించను. ఇష్టం లేకుండా నటిస్తూ కోట్ల రూపాయల్ని సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ నేను అలా చేయను. ఇటీవల కాలంలో నేను విన్న ఏ కథ కూడా నాకు నచ్చలేదు. దీంతో అనుకున్న టైమ్‌లో నా సినిమాలు రాలేదు' అని అనుష్క శర్మ తెలిపింది. 2018లో షారూఖ్‌తో కలిసి అనుష్క నటించిన చిత్రం 'జీరో'. ఈ సినిమా భారీ పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత దాదాపు రెండేండ్లకి అనుష్క 'అంగ్రేజీ మీడియం' చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. 2018 వరకు ప్రతి ఏటా కనీసం రెండు లేదా మూడు చిత్రాల్లో నటించడంతోపాటు నిర్మాతగా పలు చిత్రాల్ని కూడా నిర్మించిన అనుష్క ఎందుకు గ్యాప్ తీసుకుంటుందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, నెటిజన్లు పలు ఊహాగానాలు చేశారు. అంతేకాదు త్వరలోనే ఆమె తల్లి కాబోతున్నందుకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో వీటిపై అనుష్క స్పందించింది. 'మీరు అనుకుంటున్నట్టు నేను ప్రెగంట్ని కాదు. దీని వల్లే నేను సినిమాల్లో నటించడం లేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఇటీవల కాలంలో నన్ను మెప్పించే కథ దొరకలేదు' అని అనుష్క చెప్పింది.