Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అల.. వైకుంఠపురములో..' సినిమాలోని 'బుట్టబొమ్మ'
వీడియో సాంగ్ యావత్ ప్రపంచ వీక్షకుల్ని ఫిదా చేసింది.
ఈ పాటను ఇప్పటి వరకు దాదాపు 200 మిలియన్ల మంది చూశారు. ఇదొక రికార్డ్‌గా చిత్ర బృందం అభిప్రాయ పడుతోంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'అల వైకుంఠపురములో'.
ఈ సినిమా విడుదలై చాలా రోజులు అవుతున్నప్పటికీ పాటల పరంగా రికార్డుల పరంపర మాత్రం కొనసాగుతూనే ఉంది. అలాగే ఈ సినిమాలోని
'సామజ వరగమన...', 'రాములో రాముల..', 'బుట్టబొమ్మ...' లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్
రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి.
అన్నీ పాటలు ఎప్పుడో వంద మిలియన్ మార్కును దాటేశాయి. తాజాగా 'బుట్టబొమ్మ.. ' వీడియో సాంగ్
200 మిలియన్ మార్కును క్రాస్ చేసి కొత్త రికార్డును క్రియేట్ చేసింది.