Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన తండ్రి కృష్ణ పుట్టినరోజు (ఆదివారం) సందర్భంగా మహేష్‌బాబు స్వయంగా ఫ్యాన్స్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ సమాధానమిచ్చారు. ఆ విశేషాలు మీకోసం..
మీ ఫేవరేట్ కలర్ అండ్ ఫుడ్ ఏమిటి ?
- నా ఫేవరేట్ కలర్ బ్లూ, నాకు ఇష్టమైన ఫుడ్ మన సంప్రదాయ హైదరాబాద్ బిర్యానీ
లాక్డౌన్లో మీ ఫ్యామిలీతో గడపటం ఎలా ఉంది?
- జీవితానికి సరిపడా ఎక్స్పీరియన్స్ ఇది. ఈ లాక్డౌన్లో నేను గౌతమ్, సితారతో చాలా చేశాను. మంచి అనుభవం.
మీ కొత్త మూవీ రిలీజెప్పుడు?
- ముందు ప్రస్తుత క్లిష్ట పరిస్తుతులన్ని పోయి మంచి రోజులు రావాలి. సాధ్యమైనంత త్వరగా వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ తరువాత సినిమా రిలీజ్ గురించి చెబుతాను.
మీకు బాగా ఇష్టమైన గేమ్?
- నేను బాగా ఎంజారు చేసేది ఆన్లైన్లో మా అబ్బాయి గౌతమ్‌తో ఆడే టెన్నిస్, బేస్‌బాల్, గోల్ఫ్.
మీ వర్క్‌ని మీరు మిస్ అవుతున్నారా?
- అవును, కచ్చితంగా మిస్ అవుతున్నాను
మీ పిల్లలు కోసం మీరు చేసే బెస్ట్ డిష్?
- మ్యాగీ నూడిల్స్
మీకు ప్రేరణ ఎవరు?
- మా నాన్న కష్ణగారే.
రాబోయే రోజుల్లో పూరీతో కలిసి సినిమా చేస్తారా?
- పూరీతో తప్పకుండా సినిమా చేసే అవకాశం ఉంది. నా అభిమాన దర్శకుల్లో ఆయన ఒకరు. పూరీ వచ్చి కథ చెబుతారేమోనని నేనూ ఇప్పటికీ ఎదురుచూస్తున్నా. కథ నచ్చితే పట్టాలెక్కినట్టే.