Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చలన చిత్రసీమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని, ప్రేక్షకులు, అభిమానుల మనసులపై చెరగని ముద్రని వేసిన సూపర్ స్టార్ కృష్ణ ఆదివారం తన 77వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినీ ఇండిస్టీ ప్రముఖులందరూ కష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలిపారు. ఈ క్రమంలో చిరంజీవి ట్విట్టర్ వేదికగా కష్ణకు బర్త్‌డే విషెస్ తెలిపారు.
జుంబారే రీమిక్స్ సాంగ్..
కష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం అవుతున్న విషయం విదితమే. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. కష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆదివారం (మే 31) చిత్ర నిర్మాతలు ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. 'యమలీల' చిత్రంలో కష్ణ చేసిన సూపర్ హిట్ సాంగ్ 'జుంబారే' పాటను అశోక్ గల్లా ఇమిటేట్ చేసిన విధానం అమితంగా ఆకట్టుకుంటోంది. కాస్ట్యూమ్స్, సెట్స్ పాటకు సరిగ్గా సరిపోయాయి. ఆ పాటలో హీరోయిన్ నిధి అగర్వాల్ సైతం మెరవడంతో ఈ ప్రత్యేకమైన రోజు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది. ఇప్పటి వరకు 50 శాతం చిత్రీకరణ జరిగింది. జిబ్రాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చంద్రశేఖర్ రావిపాటి వ్యవహరిస్తున్నారు. అశోక్ గల్లా, నిధి అగర్వాల్, జగపతిబాబు, నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైలాగ్స్: కల్యాణ్ శంకర్, ఎ.ఆర్. ఠాగూర్, ఎడిటర్: పవ్రీణ్ పూడి, ఆర్ట్: ఎ. రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపాటి, నిర్మాత: పద్మావతి గల్లా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య టి.
ఇదిలా ఉంటే, కష్ణ అల్లుడు, హీరో సుధీర్‌బాబు డిఫరెంట్‌గా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.
కష్ణ 100వ చిత్రం, ఆయన కెరీర్లోనే మైల్స్టోన్ మూవీగా నిలిచిన 'అల్లూరి సీతారామరాజు' సినిమా క్లైమాక్స్ డైలాగ్‌ను డబ్ స్మాష్ చేసి సుధీర్ బాబు అభినందనలు తెలిపారు. అలాగే కృష్ణ తనయుడు మహేష్ కూడా తండ్రి బర్త్‌డే సందర్భంగా తన కొత్త సినిమా 'సర్కారు వారి పాట'ను ఎనౌన్స్ చేశారు.
కథానాయకుడిగా 345 సినిమాలు, దర్శకుడిగా 14 చిత్రాలు,నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయ భాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమా స్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70 ఎం.ఎం. చిత్రం కూడా ఆయనదే. అనితర సాధ్యం ఈ ట్రాక్ రికార్డ్. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సూపర్‌స్టార్ కష్ణగారికి
జన్మదిన శుభాకాంక్షలు
- చిరంజీవి