Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారతీయ అత్యుత్తమ చిత్రాల్లో 'అవల్ అప్పాడిథాన్' ఒకటి.
కమల్‌హాసన్, రజనీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 1978లో విడుదలై సంచలన విజయం సాధించింది.
అంతేకాదు విమర్శకుల ప్రశంసలతోపాటు పలు పురస్కరాలను సైతం దక్కించుకుంది. స్టయిలిష్ మేకింగ్, కథ, కథనాలు,
డైలాగ్స్ చెప్పే తీరులో ఓ సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి తమిళ దర్శకుడు బద్రి వెంకటేష్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ నటించనుందని సమాచారం. మాతకలో శ్రీప్రియ పోషించిన పాత్రను శృతి చెయ్యనుందట. ప్రేమలో విఫలమై పురుష ద్వేషిగా మారే అమ్మాయిగా శృతి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.
శింబు, దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటించబోతున్నారని టాక్. కమల్‌హాసన్‌గా శింబు, రజనీకాంత్‌గా దుల్కర్ లేదా విజయ దేవరకొండ నటించే ఛాన్స్‌లు పుష్కలంగా ఉన్నాయట. ఏది ఏమైనా తండ్రి కమల్‌హాసన్ నటించిన రీమేక్‌లో శృతి నటించనుందనే న్యూస్ మాత్రం ప్రస్తుతం
సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రవితేజ సరసన శృతి నటించిన
'క్రాక్' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.