Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు వాజిద్ ఖాన్ (42) కన్నుమూశారు. గత కొంత కాలంగా గుండె, కిడ్నీ సమస్యలతోపాటు బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. వాజిద్ ఖాన్ మతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అక్షరు కుమార్, పరిణీతి చోప్రా, సోనమ్ కపూర్ తదితరులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.
వాజిద్ ఖాన్ మతి తీరని లోటు అని ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా ట్వీట్ చేశారు. ''వాజిద్ ఖాన్ నవ్వును మేమెప్పుడూ మర్చిపోలేం. ఎప్పుడూ నవ్వుతూ ఉండే వాజిద్ భారు మతి పట్ల వారి కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాం' అని ప్రియాంక ట్వీట్లో పేర్కొన్నారు. వాజిద్ ఆకస్మిక మతి పట్ల ప్రముఖ నేపథ్య గాయకుడు సోనునిగం సంతాపం తెలిపారు. వాజిద్ మతి పట్ల షాక్కు గురయ్యానంటూ కథానాయకుడు వరుణ్ థావన్ అన్నారు.
సాజిద్ - వాజిద్ సోదర ద్వయం ఇటీవల కొవిడ్ లాక్ డౌన్లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ పై ''భారు భారు'తోపాటు 'ప్యార్ కరోనా' పాటలను విడుదల చేశారు. సాజిద్- వాజిద్ ఖాన్ ద్వయం సల్మాన్ ఖాన్ నటించిన 'వాంటెడ్', 'దబాంగ్', 'ఏక్ థా టైగర్' వంటి తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. సల్మాన్ కథానాయకుడిగా నటించిన 'ప్యార్ కియాతో డర్నా క్యా' సినిమాతో వాజిద్ఖాన్ సంగీత దర్శకుడిగా సినీ కెరీర్ను ప్రారంభించారు.