Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుమన్, భానుచందర్, జె. బాబు హీరోలుగా సాగర్ సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'నక్షత్ర పోరాటం 2'. ప్రముఖ దర్శకుడు సాగర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. 'ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అన్యాయం, అక్రమాలపై పోరాడే నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. సుమన్, భానుచందర్, జె.బాబు హీరోలుగా ఈ సినిమాకు పూర్తి న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఈ చిత్రానికి కోటి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రభుత్వ పర్మిషన్స్తో 'కరోనా వైరస్'కి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని త్వరలోనే షూటింగ్ మొదలు పెడతాం. ఆంధ్రప్రదేశ్, కేరళలలో షూటింగ్ ఉంటుంది' అని దర్శకుడు సాగర్ తెలిపారు. 'వస్తున్నా' చిత్రంతో హీరోగా పరిచయమైన జె.బాబు మాట్లాడుతూ, 'ఎంతో మంది ప్రముఖ హీరోలకు దర్శకత్వం వహించిన సాగర్ దర్శకత్వంలో నటించటం నా అదష్టం. సుమన్, భానుచందర్ వంటి ఇద్దరు దిగ్గజ హీరోలతో నటించే అవకాశం రావటం ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నాను' అని చెప్పారు. ఆమని, కోట శ్రీనివాసరావు, నాజర్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కోటి, పాటలు: చంద్రబోస్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, కెమెరా: మురళీ కష్ణ, ఎడిటర్: వి. నాగిరెడ్డి, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం, నిర్మాత: సాగర్.