Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరో, హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఒరేరు బుజ్జిగా'. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజరుకుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రమిది.
లేటెస్ట్గా ఈ చిత్రం నుండి 'సరిగమప' లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 'సరిగమగమ గామ హంగామ చేద్దామా.. పదనిసనిస నీస్సా నీ నీషా..నీదమా..' అంటూ హుషారుగా సాగే ఈ పాటలో రాజ్‌తరుణ్ ఎనర్జిటిక్ స్టెప్పులు, హేబా పటేల్ అందాలు యూత్‌ని ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గానం చేశారు. 'కుమారి 21ఎఫ'్, 'అంధగాడు', 'ఈడోరకం ఆడోరకం' లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌తరుణ్, హెబా పటేల్ జంట నటిస్తోన్న మరో చిత్రం కావడంలో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయి. త్వరలోనే రిలీజ్ తేదిని ప్రకటించనున్నారు' అని చిత్రయూనిట్ పేర్కొంది.
రాజ్ తరుణ్, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హేబా పటేల్, వాణీ విశ్వనాథ్, నరేష్, పోసాని కష్ణమురళి, అనీష్ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజరు ఘోష్, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, డాన్స్: శేఖర్, ఆర్ట్: టి.రాజ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజరుకుమార్.