Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వైద్యో నారాయణో హరి' అనేది భారతీయ సంస్కతి. వైద్యుడు భగవంతుడితో సమానం. తల్లిదండ్రులను జన్మనిస్తే వాళ్ళు పునర్జన్మను ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడుతున్నారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులందరికీ మనస్ఫూర్తిగా హ్యాట్సాఫ్ చెబుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని సీనియర్ కథానాయకుడు కృష్ణంరాజు అన్నారు. 'దేశానికి రక్షణ మీరు. మీరు బాగుంటే ప్రజలంతా బాగుంటారు. ప్రజలంతా బాగుంటే దేశమంతా బాగుంటుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌పై వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడుతున్నారు. ప్రాణాలను అడ్డుగా పెట్టి అనారోగ్యం పాలవుతామని తెలిసినా ప్రజలకు వైద్యం అందించి కాపాడుతున్నారు. పీపీఈ కిట్లతో ఒళ్లంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పటికీ వత్తిపట్ల అంకితభావంతో కరోనా రోగులకు వైద్యం అందిస్తున్నారు. వారి సేవలు అద్వితీయం. అనిర్వచనీయం' అని కృష్ణంరాజు చెప్పారు.