Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వకార్తికేయ, దీప ఉమావతి హీరో హీరోయిన్స్‌గా తెరకెక్కబోతున్న సినిమా 'కళాపోషకులు'. శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందబోయే ఈ చిత్ర టైటిల్ కాన్సెప్ట్ పోస్టర్‌ను నిర్మాత రాజ్‌కందుకూరి గురువారం విడుదల చేశారు. 'లవ్ స్టోరీతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయి. 'ఆ నలుగురు' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వడం విశేషం. 'కళాపోషకులు' దర్శకుడు చలపతి పువ్వుల దర్శకత్వం వహించిన 'అప్పుడు ఇప్పుడు' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మహావీర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే విధంగా ఉండనుంది' అని చిత్రయూనిట్ పేర్కొంది.