Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఐపీసీ 376'. పవర్ కింగ్ స్టూడియో బ్యానర్ పై ఎస్.ప్రభాకర్ సమర్పణలో రాజ్ కుమార్ సుబ్రమన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర ట్రైలర్‌ను సంగీత దర్శకుడు తమన్ గురువారం విడుదల చేశారు.'ఒక బంగ్లాలో జరిగే అనూహ్య ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతాయి. ఆధునిక యుగంలో సైన్స్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుందంటూ చెబుతూనే, అటు అతీంద్రియ శక్తుల ఉనికిని విజువల్స్‌లో చూపించారు. రేప్ చేస్తారు, ప్రాణాలు ఉండగానే తగలబెడతారు, అమ్మాయిలను బతకనివ్వరా అంటూ నందిత శ్వేతా చెప్పిన ఎమోషనల్ పవర్ ఫుల్ డైలాగ్‌తో ఈ చిత్ర ట్రైలర్ ఆసక్తికరంగా ముగిసింది. ట్రైలర్‌లోని పలు ఇంట్రెస్టింగ్ షాట్స్ గత థ్రిల్లర్ సినిమాలకు భిన్నమైన నేపథ్యంతో ఈ సినిమా కథ ఉండబోతోందని తెలియజేసింది. పోలీస్ అధికారి పాత్రలో నందిత శ్వేత ఫుల్ స్వింగ్‌లో నటించిందని ట్రైలర్ చూపిస్తోంది. యాదవ్ రామలిక్కమ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సి.కళాధర్ సాహిత్యం అందిస్తున్నారు. తెలుగు, తమిళం బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది' అని చిత్ర యూనిట్ తెలిపింది.