Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సినిమా పరిశ్రమ వాళ్ళు నా శరీర బరువును చూస్తున్నారా లేక నన్ను చూస్తున్నారా అనే విషయాన్ని నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తా' అని అంటోంది నిత్యామీనన్.
వైవిధ్యమైన సినిమాలు, ప్రయోగాత్మక పాత్రలకు ముఖ్యంగా మహిళా ప్రధాన క్యారెక్టర్లకు కేరాఫ్‌గా నిలిచిన నిత్యా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి అందరినీ అలరించింది. తాజాగా 'బ్రీత్ : ఇన్ టూ ది షాడోస్' పేరుతో రూపొందిన హిందీ వెబ్ సిరీస్‌లో నిత్యా నటించింది. ఈనెల 10 నుంచి ఇది అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ అద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిత్యా ప్రశ్నలకు సమాధానమిచ్చింది. అందులో శరీర బరువుపై అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో ఘాటైన సమాధానమిచ్చింది.