Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగునాట బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌కి మంచి క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'సింహా', 'లెజెండ్' రెండు చిత్రాలూ ప్రేక్షకుల విశేష ఆదరణతో ఘన విజయం సాధించాయి. అంతేకాదు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షమూ కురిపించాయి. దీంతో వీరి కాంబినేషన్లో ఓ సినిమా వస్తోందని కచ్చితంగా అందరూ భారీ అంచనాలను పెట్టుకుంటారు. తాజాగా వీరిద్దరి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇటీవల బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన బీబీ3 ఫస్ట్ రోర్ పేరుతో విడుదల చేసిన టీజర్ అందర్నీ విశేషంగా అలరించింది. ముఖ్యంగా ఇందులో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ ఆయన అభిమానుల్ని ఫిదా చేస్తే, సినిమాపై ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తించాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి 'మోనార్క్' అనే టైటిల్‌ని ఖాయం చేశారంటూ ఇప్పటివరకు ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రానికి 'సూపర్మాన్' అనే టైటిల్‌ని పెట్టాలనే యోచనలో చిత్ర బృందం ఉన్నట్టు సమాచారం. అలాగే ఇందులో బాలయ్య సరసన అమలాపాల్ కూడా నటించే ఛాన్స్ ఉందట.