Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్ కథానాయకుడిగా సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'నారప్ప'. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నారప్ప భార్య సుందరమ్మగా ప్రియమణి నటిస్తోంది. నారప్ప పెద్ద కొడుకు మునికన్నాగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తిక్ రత్నం నటిస్తున్నారు. ఆదివారం కార్తిక్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మునికన్నా లుక్‌ని 'నారప్ప' చిత్ర యూనిట్ విడుదల చేసింది. వెంకటేష్, ప్రియమణి, కార్తిక్ రత్నం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్: గాంధీ నడికుడికర్, కథ: వెట్రిమారన్, స్క్రిప్ట్ కన్సల్టెంట్: సత్యానంద్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, విజరు, లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, అనంతశ్రీరామ్, కష్ణకాంత్, కాసర్ల శ్యాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజరు శంకర్ డొంకాడ, కో- ప్రొడ్యూసర్: దేవి శ్రీదేవి సతీష్.