Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఫ్రెండ్షిప్'. ఈ సినిమాలోని సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంథెమ్‌ను రాఘవ లారెన్స్ ఇటీవల విడుదల చేశారు. సూపర్ స్టార్ ఆంథెమ్ అన్ని భాషల్లో విశేషంగా ఆకట్టుకుని ట్రెండింగ్ లో టాప్‌గా నిలిచింది.
ఈ సందర్భంగా హర్భజన్ సింగ్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలోని సూపర్ స్టార్ రజినీకాంత్ ఆంథెమ్‌ను బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు నా ఫ్యాన్స్‌కు థాంక్స్. మీ ఆదరాభిమానాలతో టాప్‌లో ట్రెండింగ్ అవుతోంది. సినిమా చాలా బాగా వచ్చింది. ఓ భిన్న పాయింట్‌తో రూపొందుతున్న ఈ సినిమా కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు. తమిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మరియనేసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, సతీష్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. సీన్‌టొ స్టూడియోస్, సినీ మాస్ స్టూడియోస్ పతాకాలపై జెపిఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వేల్మురుగన్, రాబిన్, ప్రొడ్యూసర్స్: జెపిఆర్, స్టాలిన్, దర్శకత్వం: జాన్ పాల్ రాజ్, శ్యామ్ సూర్య.