Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మన దేశంలోనే భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఒకరు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో రజనీ 'అన్నాత్తే' చిత్రంలో నటిస్తున్నారు. దీంతోపాటు కమల్‌హాసన్ నిర్మించబోయే ఓ సినిమాలో నటించేందుకు ఇటీవల గ్రీన్‌సిగల్ ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినందుకు రజనీకాంత్‌కు నిర్మాతగా కమల్‌హాసన్ ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారనే ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై చిత్ర బృందం ఇంతవరకు అధికారికంగా ఏ ప్రకటనా చేయలేదు. అలాగే ప్రస్తుతం శివ దర్శకత్వంలో నటిస్తున్న 'అన్నాత్తే' చిత్రానికి కూడా రజనీ ఇదే స్థాయి పారితోషికం తీసుకుంటున్నారని వినిపిస్తోంది. కరోనా కష్ట కాలంలోనూ ఈస్థాయి రెమ్యూనరేషన్లను తీసుకోవడం ఒక్క రజనీకాంతే చెల్లిందంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నిర్మాత కమల్‌హాసన్ ఈ సినిమాని నిర్మిస్తూనే మరో పక్క కథానాయకుడిగా 'ఇండియన్ 2' చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఇండియన్' చిత్రానికిది సీక్వెల్. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మళ్ళీ ప్రారంభమైంది.