Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మీ ప్రేమకు, ఆదరణకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఎల్లవేళల మీరు అందిస్తున్న సపోర్ట్ నన్ను మరింత ఉత్సాహంగా పని చేసేలా చేస్తోంది. నిజాయితీతో ఉన్న మీ ప్రేమ వెలకట్టలేనిది' అని అభిమానులకు బాలీవుడ్ స్టార్ కథానాయిక దీపికా పుదుకొనె కృతజ్ఞతలు తెలిపింది. భిన్న సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దీపికా సోషల్ మీడియాలోనూ అదే గుర్తింపుని సొంతం చేసుకుని ఓ అరుదైన ఘనతని సాధించింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల (5 కోట్లు) మంది ఫాలోవర్లను సంపాదించుకున్న భారతీయ నటిగా దీపికా నిలిచింది. దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా యాక్టీవ్‌గా ఉంటారు. తన సినిమాలకు సంబంధించిన విశేషాలను మాత్రమే కాకుండా, ఈవెంట్లలో పాల్గొన్న ఫొటోలు, పలు మ్యాగజైన్లకు ఇచ్చిన కవర్ పేజీ ఫొటోలు, పలు సందర్భాల్లో పాల్గొన్న ఫొటోషఉట్లు.. ఇవే కాకుండా తన వ్యక్తిగత విశేషాలను కూడా దీపికా ఎప్పటికప్పుడు తన అభిమానులతో షేర్ చేసుకుంటారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా భారీ అభిమాన గణాన్నే కాదు దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గానూ దీపికా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. దీపికా పెట్టే ఒక్కో పోస్ట్‌కి ఇన్స్టాగ్రామ్ దాదాపు కోటి యాభై లక్షల రూపాయలను ఇస్తున్నట్టు సమాచారం.