Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ లెజండరీ దర్శకుడు బాపు సోదరుడు శంకర్ నారాయణ ఇకలేరు. వయసు రీత్యా వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన గురువారం కన్నుమూశారు. బాపు ఆధ్వర్యంలో బొమ్మలు వేయటం నేర్చుకున్న శంకర్ నారాయణ ఆ తర్వాత ప్రోర్టేటర్గా మంచి గుర్తింపు పొందారు. అలాగే కార్టూనిస్ట్గానూ తన దైన ముద్ర వేశారు. ఆల్ ఇండియా రేడియో చెన్నైలో దాదాపు 30 ఏళ్ళుగా ఆయన స్టేషన్ మాస్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత అన్నయ్య బాపు దర్శకత్వం వహించిన చిత్రాలకు సంబంధించి బొమ్మలను గీయడంలో సహాయకారిగా ఉన్నారు. అంతేకాదు బాపుగారికి ఆ స్థాయిలో పేరు రావడానికి పరోక్షంగా శంకర్రావు పనితనం కూడా ముఖ్యకారణమని పలు సందర్భాల్లో బాపు చెప్పిన సంగతి తెలిసిందే. ట్వంట్వీ లివింగ్ లెజెండ్స్ పేరుతో దేేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో గుర్తింపు పొందిన 20 మంది ప్రముఖుల పోట్రేట్స్ని శంకర్ నారాయణ గీసి, మంచి ఆదరణ పొందారు.