Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కెరీర్లో ఒక్కోసారి మనం ఊహించినట్టు ఉండదు. మంచి అవకాశాలు వచ్చినప్పటికీ వదిలుకోవాల్సి వస్తుంది. అలాగే మంచి పాత్రలు, సినిమాలు వస్తాయని ఆశగా ఎదురు చూసినప్పుడు ఆ అవకాశాలు మనకి దక్కకుండా పోతాయి. ఈ తరహాలో ఏం జరిగినా నేను చాలా లైట్ తీసుకుంటా. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు ఎలా ఉంటానో, రానప్పుడు కూడా అంతే భావోద్వేగంతో ఉంటా' అని అంటోంది బాలీవుడ్ కథానాయిక దిశా పటానీ. ఇటీవల హాలీవుడ్ నుంచి ఓ ఆఫర్ దిశాకి వస్తే సున్నితంగా తిరస్కరించిందనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటికి దిశా స్పందించింది. 'బాలీవుడ్ నన్ను బాగా ఆదరించి మరిన్ని ఆఫర్లు ఇస్తోంది. అలాగే సల్మాన్‌తో 'రాధే' సినిమాలో నటిస్తున్నాను. లాక్డౌన్ వల్ల చిత్రీకరణ ఆగింది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం కానుంది. చేతి నిండా ఆఫర్లు ఉంచుకుని హాలీవుడ్కెళ్ళి వీటిని వదులుకోలేను. అందుకే ఆ ఆఫర్‌ని రిజెక్ట్ చేశా' అని దిశా తెలిపింది.