Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'విలక్షణ నటుడు కొటాశ్రీనివాసరావు వేయని పాత్రలు లేవనే చెప్పాలి.. భారతదేశంలో సుమారు అన్ని భాషల్లో నటించి మెప్పించిన గొప్ప లెజండరి యాక్టర్ ఆయన. గతంలో చాలా చిత్రాల్లో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించారు. మరికొన్ని పాత్రల్లో అపోజిషన్ లీడర్‌గా కనిపించి అశేష ప్రేక్షకలోకాన్ని మెప్పించారు. కాని మొట్టమొదటి సారిగా కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ ముఖ్యమంత్రిగా 'రోరి' చిత్రంలో నటించడం విశేషం. శుక్రవారం కొట శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్బంగా ముఖ్యమంత్రి లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో ఆయన చాలా సెన్సిటివ్ ముఖ్యమంత్రిగా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర పేరు ఆర్.రామన్న చౌదరిగా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఈ చిత్రాన్ని సీటీఎస్ స్టూడియోస్, ఎస్టీవీ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ సంయుక్తంగా చరణ్ రోరి నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ఫస్‌లుక్‌ని ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫస్ట్‌లుక్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావటం విశేషం' అని చిత్ర బృందం తెలిపింది. భీన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.