Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనారోగ్యంతో బాధపడుతున్న సహ నటుడిని ఆదుకుంటూ తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ రజనీకాంత్, కమల్‌హాసన్ రియల్ హీరోలనిపించుకుంటున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు పొన్నాంబళమ్ గత రెండు నెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీని కోసమై ఆయన చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయితే గత రెండు నెలలుగా చికిత్స కోసం ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టారు. ఇకపై జరపబోయే చికిత్సకు పొన్నాంబళమ్ వద్ద డబ్బు లేదని తెలుసుకున్న రజనీ, కమల్ ఆర్థికంగా భారీ సహాయం చేశారు. అంతేకాదు పొన్నాంబళమ్ పిల్లల చదువు బాధ్యతని కమల్ తీసుకున్నారు. విలన్‌గా తెలుగు ప్రేక్షకులకి కూడా సుపరిచితుడైన పొన్నాంబళమ్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.