Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరిందా ఆర్ట్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై అదీబ్ నజీర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఇది కల కాదు'. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా దర్శకుడు అదీబ్ నజీర్ మాట్లాడుతూ,'నేటి సమాజంలో స్త్రీల పై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను దష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన దశ్యాలు మనసుకు హత్తుకునేలా తెరకెక్కించడానికి డా||ప్రభాకర్ రెడ్డి, లక్ష్మీదీపక్ గార్ల వద్ద నేర్చుకున్న అనుభవమే ఉపయోగపడింది. ఇందులో ప్రతి ఫ్రేమ్ మన చుట్టుపక్కల జరుగుతున్న యదార్థ సంఘటనలే. పాత్రలకు తగ్గట్టు కొత్త, పాత నటీనటులను ఎంపిక చేశాం. కొత్త వారికి శిక్షణ ఇచ్చి చిత్రీకరణ పూర్తి చేశాం. ఇతివత్తానికి తగ్గట్టు ఐదు పాటలకు మంచి సంగీతం కుదిరింది. ఈ సినిమాలోని ప్రతి పాట సన్నివేశానికి అనుగుణంగా ఉంటుంది. ఈ ఐదు పాటలు సంగీత ప్రియులకే కాకుండా పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉంటాయి. ఈ చిత్రానికి కథ, కథాంశంతో పాటు పాటలు కూడా హైలెట్గా నిలుస్తాయి. సకుటుంబ సమేతంగా చూడదగ్గ ఈ సినిమా సమాజానికి సందేశం కూడా ఇస్తుంది' అని తెలిపారు. సహ నిర్మాత, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, రుబియా కౌ కాబ్ మాట్లాడుతూ,'దాదాపు రెండున్నర కోట్ల బడ్జెట్తో ఈ సినిమా చేశాం. ఆసక్తికర కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో దర్శకుడు అదీబ్ నజీర్ కూడా ఓ కీలక పాత్ర పోషించారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది' అని చెప్పారు.